తిరుమలలో ధర్మగిరి వేదపీఠాన్ని దర్శించిన వైవీ
తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. కరోనా విపత్తు నుంచి మానవాళిని రక్షించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ జూన్ 1వ తేదీ నుంచి ఇక్కడ వేద పారాయణం నిర్వహిస్తు న్నారు. కార్యక్రమంలో భాగంగా ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేద పారాయణం తదితర 7 వేదశాఖలు, 5 ఆగమ శాఖలు, 4 స్మార్థ శాఖల పారాయణం, దివ్య ప్రబంధం, శ్రీ వేంకటాచల మహాత్మ్యం, శ్రీమద్రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, శ్రీ దుర్గా సప్తశతి పారాయణం, శతంద్రీయం, అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మంత్రాలు పారాయణం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని వేద విజ్ఞాన పీఠంలో నిత్యం జరుగుతున్న పారాయణ కార్యక్రమాలను ఛైర్మన్‌కు వివరించారు.













