ఏపీ ముఖ్యమంత్రికి గుడి
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం వైకాపా నాయకులు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరిట ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఆటంకం కలిగిస్తున్నప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆయన తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను ఇతర రాష్ట్రాల నాయకులు స్వాగతిస్తున్నారని చెప్పారు. పార్టీ నేతల సహకారంతో ఆలయం నిర్మించి, అందులో జగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.













