తమకే ఇలా జరిగితే… సామాన్యుల పరిస్థితి ఏంటి? : వివేకా కుమార్తె
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి కోరారు. ఢిల్లీలో సీబీఐ అధికారులను కలసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు అవుతోందని ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని, నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందన్నారు. నేను రాజకీయవేత్తను, సామాజిక కార్యర్తను కాదు. తన తండ్రి ఏపీ దివంగత సీఎంకు సోదరుడని, ప్రస్తుత సీఎం జగన్కు స్వయానా బాబాయ్ అని చెప్పారు. తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని ఆరోపించారు. తమకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆమె ప్రశ్నించారు. ఇప్పటిఏక ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి మరణించాడు. విచారణ ఆలస్యమైతే రేపటి రోజున సాక్షులు కూడా ముందుకు రారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు.













