వివేకం సినిమా చూస్తుంటేనే భయమేసింది.. రియాలిటీ ఇంకా ఘోరంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని, దాని నుంచి బయటకు రావాలని మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివేకం సినిమాపై స్పందించారు. డాక్యుమెంటరీ అనాలో సినిమా అనాలో తెలియడం లేదు. ఎవరో కానీ చాలా ధైర్యంగా తీశారు. అందులో కొన్ని వ్యక్తిగత అంశాల్లో తేడా ఉండొచ్చు. చివరి అరగంట నాకే భయమేసింది. ఆ సమయంలో కళ్లు మూసుకున్నా. రియాలిటీని తలచుకుంటే మాత్రం వివేకం సినిమాను చాలా లైట్‌గా తీశారు. రియాలిటీ ఇంకా ఘోరంగా ఉంది. గత ఎన్నికల్లో హత్యను రాజకీయాలకు వాడుకున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నేనెప్పుడు రాజకీయాల్లో లేను. తప్పు జరుగుతోంది కాబట్టే బయటకి వచ్చి ఐదేళ్లుగా పోరాడుతున్నా. వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే వ్యక్తిగతంగా నాతో పాటు ఈ రాష్ట్రానికి మంచిది కాదు అని అన్నారు.













