తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్
తిరుమల శ్రీవారిని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి పద్మావతి అతిథి గృహం నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. కాబోయే సీఎం జగన్‌కు మహాద్వారం వద్ద టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న జగన్ కొన్ని నిమిషాల పాటు మూలమూర్తిని దర్శించుకున్నారు. హుండిలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపానికి చేరుకున్న జగన్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటాలను బహూకరించారు. జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలువురు ఎంపీలు శ్రీవారిని దర్శించుకున్నారు.













