సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన.. సంగం బ్యారేజీకి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గౌతమ్‌రెడ్డి లేకపోయిన ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.













