17 సీట్లు కాదు కదా.. అసలు గెలిచే స్థానాల్లో కూడా
ప్రభుత్వ తీరులో మార్పు రాకపోతే 175 సీట్లు కాదు కదా, అసలు గెలిచే స్థాన్లాల్లో గెలవడం కూడా కష్టమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేశారని, ఫలితంగా పాఠశాలలను మూసేస్తున్నారని పేర్కొన్నారు. 11 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. రాజకీయ నాయకుడు అబద్దాలు చెప్పి మోసం చేస్తే ప్రజలు చెప్పులతో నిలదీయాలని గతంలో జగన్ పేర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు.













