8 మంది ఎమ్మెల్యేతో పాటు… జగన్ కూడా వెళ్లలేదు : రఘురామ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చేసిన సర్వేలో ప్రతిపక్షానికి 115, పాలక పక్షానికి మిగతా సీట్లు వస్తాయని తేలిందని ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. ఏడుగురు ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లలేదని సీఎం జగన్ అన్నారని తెలిపారు. ఏడుగురు కాదు 8 మంది ఎమ్మెల్యేతో పాటు జగన్ కూడా గడపగడపకు వెళ్లలేదని తెలిపారు. అమ్మఒడి ఎత్తేస్తే ఎలా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 93 శాతం విద్యార్థులు టెన్త్ పాస్ అయ్యారని అన్నారు. తమ ప్రభుత్వంలో టీచర్లపై మానసిక ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి వివేకా కేసులో సీబీఐ విచారణ లేటైతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయన్నారు. కోనసీమ ఘటనపై హోమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు.













