కేంద్రం ఆదుకోకుంటే పరిస్థితి మరింత… దిగజారే ప్రమాదం : యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాని టీడీపీ సీనీయర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కర్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టికల్ 350 ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు పెడితే రూ.48 వేల కోట్లకు లెక్కల్లేవన్నారు. లెక్కలు చెప్పలేకపోతే ఎవరి జేబుల్లోకి వెళ్లిందో లెక్క తేల్చాలన్నారు. స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోందన్నారు. స్పెషల్ బిల్లులు అనేవి ట్రెజీ కోడ్‌లోనే లేదన్నారు. రాష్ట్ర ఆదాయన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతున్నారని ఆరోపించారు.
కేంద్రం ఆదుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. న్యాయస్థానాల తీర్పులపై చట్టసభల్లో మాట్లాడకూడదనే నిబంధనను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఏడాదిలో ప్రతిరోజూ వేజ్ అండ్ మీన్స్ కింద అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. మార్కెట్ బారోయింగ్స్ కింద రూ.55 వేల కోట్లు హాప్ బడ్జెట్ బారోయింగ్స్ కింద రూ.లక్షా 9 వేల కోట్లు అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో పీఏసీ వ్యవస్థ ఎందకు సరిగ్గా పని చేయట్లేదు. వైసీపీ ప్రభుత్వం పీఏసీ జరగనివ్వకుండా వ్యవహరిస్తోందన్నారు. చట్టాలు చేసే అధికారం లేదని కోర్టులు చెప్పకున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టాలు చేసే హక్కు చట్ట సభలకు లేదని కోర్టు చెప్పలేదు. 3 రాజధానులపైనే చట్టం చేసే అధికారం లేదని కోర్టు చెప్పిందని అన్నారు.













