Minister Kollu : రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు : మంత్రి కొల్లు

అసత్య ప్రచారాలతో వైసీపీ రెచ్చగొడితే ఊరుకునేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) హెచ్చరించారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత మాజీ సీఎం జగన్ (Jagan) కు ఏమాత్రం లేదన్నారు. సూపర్ సిక్స్ సూపర్‌హిట్ సభ విజయవంతం కావడాన్ని వైసీపీ (YCP) తట్టుకోలేకపోతోందని విమర్శించారు. నిర్మాణమే చేపట్టని వైద్య కళాశాలలకు జగన్ పేరు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 22 వైద్య కళాశాలలు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు దక్కుతుందన్నారు. మెడికల్ కళాశాలల పేరుతో జగన్ రూ.6 వేల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే టెండర్లు రద్దు చేస్తామని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.