విశాఖలో మరో అంతర్జాతీయ వేడుక

అంతర్జాతీయ స్థాయిలో మరో వేడుక నిర్వహణకు విశాఖపట్నం వేదిక కాబోతుంది. నగరంలో ఏర్పాటవుతున్న మెడక్టెక్ జోన్లో డిసెంబరు 13 నుంచి 14వ తేదీ వరకు 4వ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విశ్వ వైద్య పరికరాల సదస్సు(గ్లోబల్ మెడికల్ డివైజ్ ఫోరమ్) జరగనున్నట్లు మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు 194 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు వచ్చే అవకాశముందని వివరించారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు వ్యాధులపై ఎన్నో సాంకేతిక పరిష్కారాలతో ముందుకొస్తోందని, ఈ సదస్సు ద్వారా మరింత ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.











































































