భారత్ లో పట్టణీకరణ పెరుగుదల.. యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్
అమెరికాకు చెందిన వివిధ సంస్థలు భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నాయని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విశాఖ జోన్ ఆధ్వర్యంలో డెస్టినేషన్ విశాఖపట్నం ది గ్రోత్ హబ్ ఆఫ్ ఇండియా అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. భారత్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. గత పదేళ్లలో ఇక్కడి నగరాల్లో 100 మిలియన్ల ప్రజలు కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే పదేళ్లలో ఆ సంఖ్య 200 మిలియన్లకు చేరుతుంది. భారత్, అమెరికా సంయుక్తంగా మరికొన్ని వారాల్లో ఏపీ నుంచి నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. దేశంలో తూర్పు తీరానికి విశాఖపట్నం ఆర్థికశక్తిగా ఎదగనుంది అని పేర్కొన్నారు.













