రష్యా అమ్మాయి, ఇండియా అబ్బాయి.. మూడుముళ్ల బంధంతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ పంచాయితీ జోగన్న పాలెం గ్రామానికి చెందిన బండారు ముత్యాలనాయుడు మాస్టారు ఈశ్వరమ్మ చిన్న కుమారుడు నరేష్‌కు రష్యా దేశస్థులైన ఆండ్రి నేతాలియా దంపతుల చిన్న కుమార్తె ఇరీనా ల ప్రమే వివాహం జోగన్న పాలెం గ్రామంలో జరిగింది. వరుడు నరేష్‌కు రష్యా దేశంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం రావటంతో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. తను పనిచేసే సంస్థలోనే వధువు ఇరీనా ఉద్యోగం చేయటంతో ఇరువురి మధ్య పెరిగిన పరిచయం ప్రేమ గా మారింది. దీనితో ఇరువురి తల్లి దండ్రులు ఏకాభిప్రాయంతో ఖండాంతరాలు దాటి వచ్చి వరుడు స్వగృహం కింతాడ పంచాయతీ జోగన్న పాలెం లో హిందూ సాంప్రదాయ బద్దంగా మూడు ముళ్ళు బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలతో పాటు నియోజక వర్గం వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై వధూ వరులనూ దీవించారు.













