విజయవాడ కోర్టు సంచలన తీర్పు
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్స్ యాక్ట్ కేసెన్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలో జరిగిన అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో 2018లో జరిగిన ఈ ఘటనపై న్యాయస్థానం విచారణ చేపట్టి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న తరుణంలో పోక్స్ యాక్ట్ స్పెషల్ కోర్టు వెలువరించిన తీర్పుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













