ఈ విషయంలో కేంద్రం సవతి ప్రేమ ..విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమల్లో కేంద్రం ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో అప్రాప్రియేషన్ బిల్లు 2022పై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ విషయంలో కేంద్రం సవతి ప్రేమను చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమల్లో కేంద్రం విఫలమైందన్నారు. అన్ని అవకాశాలు ఉన్నా కేంద్రం దృష్టి పెట్టడం లేదన్నారు. ఆస్తుల పంపకం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టంగా ఉందన్నారు. దీనికి యూపీఏ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు. 2010-11 రేట్లతో 2022లో ప్రాజెక్ట్ కట్టమంటున్నారు. ఏ కాంట్రాక్టర్ ముందుకొస్తారు, నష్టాలు ఎవరు భరిస్తారు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సవతి ప్రేమ చూపించడం సరికాదు అని ఆందోళన వ్యక్తం చేశారు.













