Supreme Court : వీరయ్య చౌదరి హత్యకేసు… నిందితుడికి సుప్రీంలో ఎదురుదెబ్బ
ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి (Veeraiah Chowdhury) హత్య కేసు నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ప్రధాని నిందితుడు సురేష్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ రాజేశ్ బిందాల్ (Rajesh Bindal) , జస్టిస్ మన్మోహన్ (Justice Manmohan) ధర్మానం ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సురేశ్‌బాబు (Suresh Babu) పరారీలో ఉన్నట్లు గతంలో పోలీసులు వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌కు అతడికి అర్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడిరచింది. కేసులో డబ్బులు చేతులు మారడం, ఫోన్ కాల్స్ సహా తగినన్ని ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం సృష్టం చేసింది. మిగిలిన నిందితులకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పగా కింది కోర్టులో తెచ్చుకోవాలని ధర్మాసనం సూచించింది.







