అమె రోజాకి పోటీ?
వైసీపీ మహిళ ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014 వైసీపీ ఓటమి తర్వాత ప్రభుత్వంపై రోజా విమర్శల పర్వం పెరిగింది. అసెంబ్లీ ఎపిసోడ్‌తో ఆమె విమర్శల స్థాయేంటో అందరికీ తెలిసింది. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ నాయకులను విమర్శల పేరుతో తిట్టడానికి ప్రయత్నించే రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే విమర్శల రూపంలో కాకుండా సినీ గ్లామర్‌తో దెబ్బ కొట్టాలని భావించి, అప్పటి హీరోయిన్, ఇప్పటి నటి వాణీ విశ్వనాథ్‌ను పార్టీ రంగంలోకి దించింది. వాణీ విశ్వనాథ్ టీడీపీలో చేరే విషయంపై సృష్టత వచ్చింది. త్వరలో తెలుగుదేశంలో చేరబోతున్నట్లు అమె తెలిపింది. అందేకాదు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అమె సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అధిష్ఠానం వాణీ విశ్వనాథ్‌ను నగరి నుంచి పోటీ చేయించేందుకు పావులు కదుపుతోంది. రోజాకు గట్టి కౌంటర్ ఇచ్చే మహిళ నేతలు పార్టీలో తక్కువగానే ఉన్నారని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అనిత, మరో ఒకరిద్దరు మినహాయిస్త రోజా విమర్శలకు పూర్తి స్థాయిలో మిగిలిన వారు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. వాణీ విశ్వనాథ్ అయితే సినీ గ్లామర్ కూడా కలిస్తొందని పార్టీ భావిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే రోజాకు 2019లో పోటీ ఇచ్చే అభ్యర్థి వాణీ విశ్వనాథే కాబోతోంది.













