Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి షాక్
వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi ) కి మరోసారి షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయం (Gannavaram TDP office )లో డీటీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ (Satyavardhan) కిడ్నాప్ కేసులోనూ ఆయనకు చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషిన్‌ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సత్యవర్ధన్‌కు ప్రాణహాని ఉందని బాధితుడు తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే వంశీని రిమాండ్‌కు తీసుకున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతడి తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.













