ఆ ఒక్కరి రాజీనామాతో ప్రత్యేక హోదా : విహెచ్
ఉభయసభల్లో ఎంతమంది ఎంపీలు రాజీనామా చేసినా ప్రత్యేకహోదా రాదని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజీనామా ఒక్కటే మార్గమని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీనే కాదు ఏపీ ప్రజలనూ కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని మోదీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కేంద్రం కళ్లు తెరిపించేందుకే చంద్రబాబు దీక్ష చేపట్టారని అన్నారు. ఏపీపై చ్తితశుద్ధి ఉంటే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంకయ్య రాజీనామా చేస్తే మోదీ, జైట్టీ భయపడతారన్నారు. మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన కారణంగా నేటికి నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు.













