రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదు
నవ్యాంధ్ర రాజధాని మార్పుపై చర్చ నడుస్తున్న సమయంలో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. హైదరాబాద్లో సనత్నగర్ ఈఎస్ఐసీలో రూ.150 కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన సృష్టం చేశారు. ఈ అంశం కేంద్ర పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్యశ్రీ నుంచి మంచి కార్యక్రమం అయితే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.













