గో ఆధారిత వ్యవసాయానికి టీటీడీ అండగా : వై.వి.సుబ్బారెడ్డి
గో ఆధారిత ప్రకృతి వ్వవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అండగా ఉంటుందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. కలుషిత పాలు, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల క్యాన్సర్ పెరుగుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామని చెప్పారు. నేలతల్లిని కాపాడి ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించే దిశగా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే జాతీయ గోమహాసమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రత్యేక విభాగంతో టీటీడీ ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలిపారు.













