తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మూెత్సవాలు
అధికమాసం కారణంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఈ ఏడాది రెండు బ్రహ్మూెత్సవాలు జరగనున్నాయి. వార్షిక, నవరాత్రి పేరిట బ్రహ్మూెత్సవాల నిర్వహణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీకారం చుట్టింది. వార్షిక బ్రహ్మూెత్సవాలు సెప్టెంబరు 13న ధ్వజారోహణంతో ఆరంభం కానున్నాయి. అదే రోజు రాత్రి శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు యథావిధిగా వాహనసేవలను టీటీడీ నిర్వహిస్తుంది. రాత్రి సమయంలో మాత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనుంది. ఇది వరకు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు వాహనసేవలు జరిగేవి. గరుడసేవ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. భక్తుల నుంచి వచ్చిన విన్నపాలను దృష్టిలో పెట్టుకుని ఆగమ సలహా తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మార్పునకు శ్రీకారం చుట్టింది.













