దర్శనాల విషయమై వచ్చిన వార్తలు అవాస్తవం – టీటీడి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాల విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మకర్తల మండలితో చర్చించి తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 30 వతేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అదంతా అవాస్తమని టీటీడీ వెల్లడించింది. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించే విషయంపై ధర్మకర్తల మండలి తగు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్య చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని టీటీడీ వెల్లడించింది













