భక్తులకు మరింత మెరుగైన సేవలు : పుట్టా
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల టీటీడీ చైర్మన్, అధికారులతో కలిసి తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట, నందకం అతిధి భవనంలోని మిని కళ్యాణకట్టలు, నారాయగిరి ఉద్యాణవనంలోని క్యూలైన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ భక్తులు పవిత్రంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలలో మరింత శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోట్టున్నట్లు తెలిపారు. కళ్యాణ కట్టలో భక్తి భావం ఉట్టిపడేలా ఫ్లోరింగ్, వాల్ టైల్స్‌ను మార్చనున్నట్లు వివరించారు. భక్తులు తలనీలాలు సమర్పించే సమయంలో నేలపై కాకుండా చిన్న స్టుల్పై కుర్చుని తలనీలాలు సమర్పించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధింత అధికారులకు సూచించారు. తిరుమలలో భక్తులు, ఉద్యోగులు, క్షురకులు, శ్రీవారి సేవవకులు ఒకరినొకరు గోవిందా అని సంభోదించుకోవాలని కోరారు.













