పర్యాటక హబ్ గా సీమ : చంద్రబాబు
క్రమ శిక్షణతో బాధ్యతలను నిర్వర్తించిన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాయలసీమ ఇన్స్పెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాయల సీమలో పోలీసింగ్ అత్యంత ముఖ్యమని శాంతి భద్రతలను పరిరక్షించి సీమను పర్యాటక హబ్‌గా మార్చాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాయలసీమకు చెందిన పదోన్నతలు పొందిన ఇన్స్పెక్టర్లు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కొందరు ఇన్స్పెక్టర్లు సాంకేతిక కారణాల వల్ల 2008 బ్యాచ్‌కు చెందిన వారికి పదోన్నతి లభించిందని, మరో 43 మంది సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్లకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి డిజీపీ ఆర్పీ ఠాగూర్‌తో చర్చించి 43 మందికి పదోన్నతలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును డిజిపి ఆర్పీఠాగూర్ నేతృత్వంలో ఐజీ శ్రీధర్‌రావు, సీమ డిఐజి జి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన ఇన్స్పెక్టర్లు ఘనంగా సత్కరించారు.













