నాకు ప్రాణం టిడిపి కార్యకర్తలంటే- CM
ప్రతి తెలుగుదేశం కార్యకర్త సంకల్పం చేయాలి. 25ఎంపి సీట్లు, 150పైగా అసెంబ్లీ సీట్లలో టిడిపి గెలుపే మనందరి సంకల్పం కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.
నాకు ప్రాణం టిడిపి కార్యకర్తలంటే.
ఎన్టీఆర్ ను, నన్ను నిలబెట్టింది కార్యకర్తలే
మీ వల్లే తెలుగుదేశం నిలబడగలిగింది.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం.
పార్టీ కోసం పనిచేసే వాళ్లందరి బాధ్యత నాదే
కార్యకర్తల సంబరాలే నాకెంతో కిక్కు
రేపటి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలి
తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరం.
భోజనానికి, నిద్రకు మాత్రమే ఇంటికెళ్లాలి
ఈ 50 రోజులు మిగతా సమయం అంతా పార్టీకే
5ఏళ్లలో మనం చేసిన పనులే మనకెంతో తృప్తి
అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలి
ఇన్నిచేసిన టిడిపికి అండగా ఉండాలని కోరాలి
ప్రజలందరి మద్దతు టిడిపికి కూడగట్టాలి.
ప్రాజెక్టులు కట్టాం- నీళ్లిచ్చాం, పరిశ్రమలు తెచ్చాం-ఉపాధి కల్పించాం
సిమెంట్ రోడ్లు వేశాం-ఎల్ ఈడి బల్బులు పెట్టాం
లక్షలాది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం-30లక్షల ఇళ్లు పేదలకు నిర్మిస్తున్నాం
వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చాం-పేదరికంపై గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాం
రాష్ట్రంలో మనం చేయని పనులేం ఉన్నాయి..?
మరి ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందా..?
అభివృద్ది, సంక్షేమం చేసిన టిడిపికే ఓటడిగే హక్కు ఉంది.













