ట్రిపుల్ క్రాన్ ఈదిన.. తొలి ఇండియన్ పోలీస్ గా రికార్డు
పసిఫిక్ మహా సముద్రంలోని ట్రిపుల్ క్రాన్ (ఇంగ్లిష్, కటాలినా, 20 బ్రిడ్జెస్) జలసంధుల ఈతను ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ మోతూకురి తులసీ చైతన్య పూర్తి చేశారు. కటాలినా నుంచి అమెరికా వరకు 35 కిలోమీటర్లు ఉన్న కటాలిని జలసంధి ఈతను 2019లోనే పూర్తి చేశాడు. మిగిలిన రెండు జలసంధులను ఈదేందుకు ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లోని పసిఫిక్ తీరానికి చేరుకున్నాడు. జులై 26 ఇంగ్లండ్ నుంచి ప్రాన్స్ వరకు 52 కి.మీ. ఉన్న ఇంగ్లిష్ చానల్ ఈతను 15 గంటల్లో పూర్తి చేశాడు. ఈ నెల 13న న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ సముద్ర తీరం చుట్టూ 45. కి.మీ పొడవున్న 20 బ్రిడ్జెస్ జలసంధిని 7:45 గంటల్లో ఈదాడు.
తులసీచైతన్య విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్. ట్రిపుల్క్రాన్ జలసంధుల ఈతను పూర్తి చేసుకుని తిరిగి విజయవాడకు చేరుకున్న తులసీ చైతన్యను పోలీస్ కమిషనర్ టీకే రాణా అభినందించారు. ఈ జలసంధులను ఈదిన మొదటి ఇండియన్ పోలీస్‌గా రికార్డు సాధించడం గర్వకారణమన్నారు.













