మే 23 తర్వాత ఆయన ఇంటికి టులెట్ బోర్డే : యామిని
వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఈ సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ సృష్టం చేశారు. ఉండవల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మే 23 తర్వాత తాడేపల్లిలోని తన ఇంటికి ఆయన టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని తెలిపారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌కు పర్యాటకులుగా మారారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఏ ఒక్క ప్రజా సమస్యపైనా స్పందించని జగన్. సైకో డైరెక్టరు తీసిన సినిమా మీద ట్వీట్ చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ పేరుతో పింఛన్లు సీఎస్ అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.













