ముగిసిన టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం
ఈనెల 25న మరోసారి భేటీ కావాలని నిర్ణయం
ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయం –tdpmanifesto.com ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ – మేనిఫెస్టో రూపకల్పనపై ఇప్పటికే యనమలకు పలు సూచనలు చేసిన సీఎం – మేనిఫెస్టోలో ముఖ్యంగా 5 అంశాలపై దృష్టిసారిస్తాం – సంక్షేమం, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యం – ప్రతి ఐదు రోజులకు ఒకసారి సమావేశం – ప్రజల తలసరి ఆదాయం రూ.3.78 లక్షలకు చేర్చడమే లక్ష్యం – మార్చి మొదటివారానికల్లా మేనిఫెస్టో పూర్తయ్యేలా ప్రయత్నిస్తాం – 2014 ఎన్నికల అజెండాలో హామీలన్నీ అమలు చేసిన ఘనత మాది : అచ్చెన్నాయుడు.













