రాజకీయాలెందుకు స్వామీజీ?
ప్రవచనాలు చెప్పాల్సిన స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్శించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు వేస్తానని స్వామీజీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పీఠాధిపతిగా ఉండి వైకాపాకు అనుకూలంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజకీయాలు చేయాలంటే పీఠాధిపతి పదవి వదిలేసి వైకాపాలో చేరవచ్చని హితవు పలికారు. రాష్ట్ర దేవదాయ శాఖ సలహాదారు రామకోటయ్య మాట్లాడుతూ సీఎంపై స్వామీజీ ఎందుకు విషయం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. గతంలో తిరుమలపై అనేక వ్యాఖ్యలు చేసిన సీఎంలపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని స్వామీజీని ఆయన డిమాండ్ చేశారు.













