ఏపీలో టాటా మెగా కేన్సర్ ఆసుపత్రి

టాటా ట్రస్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కానున్నది. ఇప్పటికే ముంబయి కేంద్రంగా విజయవంతంగా నడుస్తున్న టాటా కేన్సర్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా దేశంలోని మరో అయిదు రాష్ట్రాలలో కేన్సర్ ఆసుపత్రులను ప్రారంభించాలని టాటా యాజమాన్యం నిర్ణయించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రధానమైన నగరాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. రోగుల సంఖ్య విపరీతం కావడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు టాటా యాజమాన్యం వెయ్యి కోట్ల ఖర్చుతో ఆసుపత్రులను నిర్మించేందుకు ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి లేదా విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఆసుపత్రిని నిర్మించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం స్థలం కేటాయించే అవకాశాలున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంగా టాటా ట్రస్టు స్థలానికి సంబంధించి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకునే అవకాశాలున్నాయి. టాటా ట్రస్టుకు అంతర్జాతీయ గుర్తింపు వున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహిస్తుందని











































































