మూడు రాజధానుల అంశంపై సుప్రీంలో విచారణ
ఆంధప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టులో తమ వాదన వినలేదని రాయలసీమకు చెందిన పలువురు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. చట్టాలను ప్రభుత్వాలు సమర్థించుకుంటాయి కదా అని జస్టిస్ అశోక్ భూషణ్ పేర్కొని.. వ్యక్తులుగా చట్టాలకు మద్దతు అంటూ ఎలా కోర్టును ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. మూడు రాజధానులకు మద్దతుగా ఏమైనా అసోసియేషన్లు పిటిషన్ వేస్తే పరిశీలించాలని హైకోర్టుకు సూచించారు.













