జనసేనతో కలిసి అధికారంలోకి వస్తాం
జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేత సునీల్ దేవ్‌ధర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పెదకాకాని ఆలయ ప్రాంగణంలో మాంసాహారం ఘటనపై చర్యలేవని ప్రశ్నించారు. క్యాంటీన్ నిర్వాహకుడు షరీఫ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. తిరుమల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని విమర్శించారు. జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లిక్కర్, ఇసుక, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. మైనార్టీలను బుజ్జగించి హిందువులను కించపరుస్తారా? అని ప్రశ్నించారు.













