ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆంధప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సృష్టం చేశారు. జులై 10 నుంచి యధావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోజురోజుకి వైరస్ వ్యాప్తి పెరిగిపోతుండటంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేయడంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పది పరీక్షలపై మంత్రి స్పందించారు.













