కనుల పండువగా శ్రీవారి పుష్పయాగం
కార్తిక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కనుల పండువగా జరిగింది. 17 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయ్ప స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. ఎనిమిది టన్నుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం ఇనుమడిరచింది. శ్రీశారి బ్రహ్మోత్సవాల దోష నివారణకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం నిర్వహించారు. వేడుకలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.













