31న శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 31వ తేదీన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఉభయదేశాలయాలను మూసివేయనున్నట్లు ఈవో భరత్‌గుప్తా తెలిపారు. గ్రహణం రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, మహామంగళహారతులు జరపనున్నట్లు తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి 7:30 గంటల వరకు స్వరదర్శనం ఉంటుందన్నారు. 8 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు తెలిపారు. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటో తేదిన ఉదయం 3.30 గంటలకు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రాత కాలపూజలు జరిపి ఉదయం 6.30 గంటలకు నుంచి దర్శనాలు, ఆర్జిత సేవలు ప్రారంభిస్తారన్నారు.













