సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మూెత్సవాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూెత్సవాలను సెప్టెంబరు 23వ తేదీ నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్రహ్మూెత్సవాలకు సంబంధించి ఈవో అధ్యక్షతన తిరుమల లోని అన్నమయ్య భవనంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆ వివరాలను ఈవో సింఘాల్ మీడియాకు వెల్లడించారు. బ్రహ్మూెత్సవాలను తిలకించడానికి లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి లోటు రాకుండా సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల, తిరుపతిలో ఇంజినీరింగ్, ఇతర పనులకు రూ.8 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణకు బ్రహ్మూెత్సవాల మొదటిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వస్తారని తెలిపారు. బ్రహ్మూెత్సవాల్లో ప్రధానమైన గరుడసేవను 27వ తేది రాత్రి 7:30 గంటలకే ప్రారంభిస్తామన్నారు.













