శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు టిటిడి సమాయత్తం
ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు నిర్వహించేందుకు టిటిడి సమాయాత్తం అవుతోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 23న ధ్వజారోహణం, సెప్టెంబరు 27న గరు డోత్సవం, సెప్టెంబరు 28న స్వర్ణరథం, సెప్టెంబరు 30న రథోత్సవం, అక్టోబరు 1న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయి. ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తకోటికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసియున్న తిరుమల దివ్వక్షేత్రంలో ప్రతి ఏటా బ్రహ్మూెత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం అనవాయితీ. నిత్య కల్యాణచక్రవర్తికి ఏటా నిర్వహించే 450 ఉత్సవాల్లో సాక్షాత్తు అష్టికర్త అయిన బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలుగా బ్రహ్మూెత్సవాలు ప్రసిద్దికెక్కాయి. బ్రహ్మూెత్సవాల కోసం ఆయా విభాగాలు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించాయి. బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో భక్తులకు టిటిడి పలు సూచనలు చేస్తోంది.













