ఆరు నెలల చిన్నారికి అంతర్జాతీయ అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఆరు నెలల చిన్నారి అంతర్జాతీయ అవార్డు సాధించాడు. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని శాస్త్రినగర్‌కు చెందిన పవన్‌కుమార్, సౌమ్య ప్రియ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జంతువులు, పండ్లు, వాహనాలు అంకెలు, పక్షులు, కూరగాయాల పోటోలను చూపించి వాటి పేర్లను కుమారుడికి తల్లి నేర్పించేవారు. బుడతకు అన్ని పేర్లను గుర్తించుకుని, ఠక్కున సమాధానం చెప్పేవాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈనెల 19న నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థకు తల్లిదండ్రులు పంపారు. పరిశీలించిన నిర్వాహకులు ఆ చిన్నారి ప్రతిభను మెచ్చి ఈ నెల 29న ఆన్లైన్ ద్వారా అవార్డు అందించారు. కుమార్తె వినీష్ కూడా నాలుగేళ్ల వయస్సులోనే ఐదు అవార్డులు సాధించిందని తల్లిదండ్రులు తెలిపారు. ప్రజ్వల్ తండ్రి వస్త్ర వ్యాపారి, తల్లి గృహిణి.













