SIIMA 2025: సైమా2025లో టాప్ నామినేషన్స్ ఈ సినిమాలకే!
సౌత్ సినీ ఆడియన్స్ ఎంతో వెయిట్ చేస్తున్న సైమా 2025(SIIMA2025)కు రంగం సిద్ధమైంది. 2012లో మొదలైన ఈ సైమా వేడుకలు ఇప్పుడు 13వ ఎడిషన్ కు రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 5,6 తేదీల్లో దుబాయ్ లో సైమా2025 వేడుకలు జరగనున్నాయి. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీల్లోని బెస్ట్ టాలెంట్ ను గుర్తించి వారిని సత్కరించే ఈ వేడుకలు గత రెండేళ్లుగా దుబాయ్ లోనే జరుగుతున్నాయి.
కాగా తాజాగా సైమా అవార్డుల కమిటీ నామినేషన్ జాబితాను రిలీజ్ చేయగా అందులో తెలుగులో ఎక్కువ నామినేషన్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప2 సినిమా టాప్ లో నిలిచింది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ సైమా2025లో ఏకంగా 11 నామినేషన్ ను దక్కించుకుంది.
పుష్ప2(Pushpa2) తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి2898ఏడీ(Kalki 2898AD) సినిమాకు 10 నామినేషన్ రాగా, తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో వచ్చిన హను మాన్(Hanu Man) సినిమాకు కూడా 10 నామినేషన్స్ దక్కాయి. గతేడాది వచ్చిన ఈ మూడు సినిమాలూ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా నిర్మాతలకు కలెక్షన్ వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే.







