ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా
ఆంధప్రదేశ్‌లో కరోనా వీరవిహారం చేస్తోంది. ప్రతిరోజు 2 వేల పైనే కేసులు నమోదవుతుండగా సామాన్య ప్రజలతో పాటు నాయకులకూ సోకుతుంది. ఇప్పటికే ఆంధప్రదేశ్‌లో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని అభిమానులు, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించారు. తాను త్వరలోనే ప్రజా సేవలో పాల్గొంటానని పేర్కొన్నారు. తనను పరామర్శించడానికి రావొద్దని చక్రపాణిరెడ్డి కోరారు.













