ప్రతిసారి పార్టీలు మారే ఆలోచన.. నాకు లేదు
మంత్రి పదవి రానంత మాత్రాన ఏ పార్టీకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నాకు అపారమైన నమ్మకం ఉందన్నారు. వారితోనే ఉంటూ. ప్రజల కోసం పని చేస్తాను. నేను అలిగే వ్యక్తిని కాదు, పోరాడే వ్యక్తిని అన్నారు. ప్రతిసారి పార్టీలు మారే ఆలోచన నాకు లేదన్నారు. మహానాడును అంతా బూచిగా చూపించారు. త్వరలో నిర్వహించే వైసీపీ ఫ్లీనరీ చూస్తే టీడీపీ వాళ్లకు దిమ్మ తిరుగుతుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధితో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలుస్తాం అని అన్నారు.













