ధర్మపోరాట దీక్షలో తెలుగుతల్లి!
ఢిల్లీలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో తెలుగుతల్లి వేషంలో వచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి సాధినేమి యామినీ శర్మ అందరి దృష్టిని ఆకర్షించారు. నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం అని స్లోగన్ రాసుకున్న ప్లకార్డును పట్టుకుని వేదికపై యామిని తిరుగుతూ ఉంటే, పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆమాట్లాడుతూ తన ఓ కుమారుడు చంద్రబాబునాయుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మోదీని నిలదీస్తూ, అలుపెరగని పోరాటం చేస్తుంటే, మరో కుమారుడు వైఎస్ జగన్ అదే మోదీకి మద్దతిస్తూ.. ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించిన సమయంలో దీక్షా స్థలి చప్పట్లతో మారుమోగింది. తన కుమారుడు దారితప్పి తిరుగుతున్నాడని, అతన్ని దారిలోకి తెచ్చే బాధ్యత ప్రజలదేనని అన్నారు.













