ఏపీలో విదేశీయులు గుర్తింపు సవాలే…
విదేశాల నుంచి విచ్చన ఆంధప్రదేశ్‌లో ఉంటున్నవారిని గుర్తించడం, ఐసోలేట్ చేయడం పెద్ద సవాలుగా మారిందని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా రాష్ట్రాల సన్నద్ధతపై కోవిడ్ 19పై జాతీయ సన్నద్ధత సర్వే పేరిట కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ మార్చి 25 నుంచి 30 వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జిల్లా కలెక్టర్లు, 2014-2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించింది. లాక్డౌన్ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తుడడం ప్రకాశం జిల్లాకు సమస్యగా మారిందని అందులో వివరించింది.













