Ravinaidu : ఏపీకి అభివృద్ధి, విపత్తుల సమయంలో నాట్స్ సహకారం : శాప్ చైర్మన్ రవి
ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కృషి చేస్తున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు (Ravinaidu) అన్నారు. ఉత్తర అమెరికాలో నిర్వహించిన నాట్స్((NATS)) సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వారికి రాత పరీక్ష లేకుండా 3 శాతం రిజర్వేషన్‌తో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి, విపత్తుల సమయంలో నాట్స్ తరపున సహకారం మరువలేనిదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న నాట్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. పీ4 విధానం ద్వారా ఏపీలో క్రీడాకారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు.













