రమణ దీక్షితులుకు ఎదురుదెబ్బ
తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా తనను అర్చక పదవి నుంచి తొలగించారంటూ రమణ దీక్షితులు వేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్పై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సూచించింది. ముందుగా హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారంటూ రమణ దీక్షితులు తరపు న్యాయవాదిని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే అక్కడ న్యాయం జరగదనే ఉద్దేశంతోనే ఇక్కడి వచ్చామని, గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అభ్యంతరకంగా ఉందంటూ వాదించారు. ఏది ఏమైనా ఈ పిటిషన్పై ముందుగా హైకోర్టులో విచారణ జరిగిన తర్వాతే సుప్రీంకోర్టుకు రావాలని ధర్మాసనం సృష్టం చేసింది.













