దీనిపై ఎవరైనా చర్చకు వచ్చినా సిద్ధమే : రామ్మోహన్ నాయుడు
ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ (Jagan) ఐదేళ్లలో అన్నీ తప్పుడు బటన్లు నొక్కారని, చంద్రబాబు (Chandrababu)ను అక్రమంగా అరెస్టు చేసి అతి పెద్ద తప్పు చేశారని, అందుకే ప్రజల ఆగ్రహానికి గురయ్యారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) మండిపడ్డాడరు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ (Bhashyam Praveen) చేపట్టిన 100 రోజులు వంద గ్రామాలు ముగింపు కార్యక్రమం, కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభను పల్నాడు జిల్లా అమరావతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడే కోలుకుంటోందని, రెండేళ్లలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. ఎంత అభివృద్ధి చేశామో పుస్తకాలు వేసి చూపిస్తున్నామని, దీనిపై ఎవరైనా చర్చకు వచ్చినా సిద్ధమేనని అన్నారు. గొడ్డలి పార్టీకి గంజాయి, హత్యలే తెలుసన్నారు. మరో 30 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. నియోజకవర్గ పరిధిలో 100 గ్రామాల్లో 100 రోజులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ను రామ్మోహన్ నాయుడు అభినందించారు.








