రాధా గాయత్రి కుటుంబానికి అండగా ఉంటాం : పల్లా శ్రీనివాస్
విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి (Radha Gayatri) అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసు గురించి విన్నప్పుడు చాలా బాధ కలిగిందన్నారు. అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ శ్రీచరణ్ (Sreecharan) సంహాచలం పరిధిలో ఒక లాడ్జిలో దిగినట్లు బంధువులు చెబుతున్నారు. కేసు నమోదైన వెంటనే ఇక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. ఇప్పటికే మసూరీలో కేసు నమోదు చేశారు అని పల్లా తెలిపారు.
విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రికి గతేడాది నవంబర్‌లో విశాఖకు చెందిన శ్రీచరణ్‌తో వివాహమైంది. ఇద్దరూ కలిసి ఇటీవల విహారయాత్రకు వెళ్లగా ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని దేహ్రాదూన్‌లో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.








