చీరకట్టులో ఆషిక రంగనాథ్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్రేజీ బాయ్(Crazy boy) అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆషిక, 2023లో అమిగోస్(Amigos) అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి తగిన స్థాయిలో స్టార్డమ్ రాలేదు. ప్రస్తుతం విశ్వంభర(Vishwambhara), సర్దార్2(Sardar2) లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైన ఆషిక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఆషిక తాజాగా మెరూన్ కలర్ పై గోల్డెన్ కలర్ జరీ అంచున్న చీరను ధరించి, దానికి మ్యాచింగ్ గా గోల్డెన్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ డిజైన్డ్ బ్లౌజ్ ను వేసుకుని చీరలో కూడా ఈ రేంజ్ అందాలను ఆరబోయొచ్చా అనేలా ఫోటోలకు పోజులివ్వగా, ఆ ఫోటోలను కుర్రాళ్లు తెగ షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.








