2029 ఎన్నికల విజయమే – రాష్ట్రానికి స్వర్ణయుగం
అమెరికా రాజధాని వేదికగా.. చిత్తూరు(జిల్లా), నగరి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ గాలి భానుప్రకాష్ తో ప్రవాస తెలుగు వారి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాగులూరి భానుప్రకాష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో ప్రవాస తెలుగు వారి పాత్ర, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి, సమర్ధ నాయకత్వం, కేంద్రప్రభుత్వ సహకారం.. ఇలా పలు అంశాల పట్ల అభిప్రాయలు, ఆలోచనలు పంచుకున్నారు.
శాసనసభ్యులు భానుప్రకాష్ మాట్లాడుతూ.. తెలుగు నేలపై 2024 ఎన్నికల విజయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ప్రతి తెలుగువాడిదన్నారు. ఈ విజయంలో ప్రవాసుల కృషి, చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ ప్రస్తావిస్తుంటారు. కూటమి ప్రభుత్వం, సమర్ధ నాయకత్వంలో పలురంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లోకేష్ గారి చొరవతో విద్య రంగం నూతన సంస్కరణలతో పురోగతికి ఇటీవలి పదోతరగతి ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రజాభిమానం తోడుగా నగరి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు నుండి ఈనాటి వరకూ దశాబ్దాలుగా విలువలతో ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామన్నారు. 2029 ఎన్నికల విజయం లక్ష్యంగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.


తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ కీ.శే గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజకీయ జీవితం మార్గదర్శకమని, భానుప్రకాష్ యువ శాసనసభ్యునిగా ప్రజాసేవలో ఆ వారసత్వాన్ని, విజయాన్ని కొనసాగించాలని, చంద్రబాబునాయుడు, లోకేష్ పిలుపు మేరకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ విజయమే తమ శిరోధార్యమన్నారు.
సమన్వయ కర్త మాగులూరి భానుప్రకాష్, యాష్ బొద్దులూరి, సుధీర్ కొమ్మి మాట్లాడుతూ మాతృభూమి, మాతృబాష తమకు రెండుకళ్ళుగా ప్రవాస తెలుగు వారు పనిచేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు సహకారం, తోడ్పాటు ఎల్లప్పుడూ అందిస్తామని, ఎన్నికల్లో విజయమే నేడు జరుగుతున్న అభివృద్ధికి కొనసాగింపు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిశ్రీనివాసరెడ్డి భూమిరెడ్డి, సత్యనారాయణరాజు, మాధవనాయుడు బోయెల్ల , ప్రదీప్ గుత్తా, సీతారామారావు యెండూరి, చంద్రనాధ్, వెంకట రెడ్డి, వెంకటేశ్వర్రావు సామినేని, అమరలింగం, సుదర్శన్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, వీరభద్రరావు, సురేష్, భిక్షపతి, శంకరరావు మరియు పలువురు ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.








